మునుపెన్నడూ చూడని అవతారంలో మహేశ్ బాబు... జులై 31 వరకు ఆగాల్సిందే!

29-07-2021 Thu 18:25
  • 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న మహేశ్ బాబు
  • పరశురాం దర్శకత్వంలో చిత్రం
  • ఆసక్తికరమైన అప్ డేట్ పంచుకున్న చిత్ర యూనిట్
  • "ఫస్ట్ నోటీస్" అంటూ ప్రకటన
Mahesh Babu in never seen before avatar

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం నుంచి ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. మహేశ్ బాబును మునుపెన్నడూ చూడని అవతారంలో చూస్తారన్నదే ఆ ప్రకటన సారాంశం. అందుకోసం జులై 31 వరకు ఆగాల్సిందేనని చిత్రబృందం వెల్లడించింది. "సూపర్ స్టార్ నుంచి ఫస్ట్ నోటీస్" అంటూ చిత్ర టైటిల్ కు అనుగుణంగా ప్రకటన చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టయిన్ మెంట్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రానికి పరశురాం దర్శకుడు. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.