Peddireddy: రేపు కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న పెద్దిరెడ్డి

Peddireddy joining TRS tomorrow
  • ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన పెద్దిరెడ్డి
  • రేపు టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రకటన
  • కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా శిరసా వహిస్తానని వ్యాఖ్య
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు టీఆర్ఎస్ లో చేరబోతున్నానని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రేపు టీఆర్ఎస్ లో చేరుతానని చెప్పారు. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి బాధ్యతలను అప్పగించినా శిరసా వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

 దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జీగా పని చేశానని... అయినా హుజూరాబాద్ లో తనను ఇన్ఛార్జీగా నియమించలేదని విమర్శించారు. తనకు చెప్పకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ దేవాలయ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే... బీజేపీ ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు.
Peddireddy
KCR
Huzurabad
BJP
TRS
Etela Rajender

More Telugu News