దేవినేని ఉమ బెయిల్ పిటిషన్.. స్వీకరించిన ఏపీ హైకోర్టు

29-07-2021 Thu 17:55
  • దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ, కుట్ర తదితర కేసుల నమోదు
  • 14 రోజుల రిమాండ్ విధించిన స్థానిక కోర్టు
  • రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Devineni Uma files bail petition in AP High Court

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు కుట్ర తదితర కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 12 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, ఈరోజు ఏపీ హైకోర్టులో దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జి.కొండూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో ఆయన కోరారు. దేవినేని ఉమ వేసిన పిటిషన్ ను హైకోర్టు అడ్మిట్ చేసుకుంది. రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.