'రామారావు ఆన్ డ్యూటీ'తో హీరో వేణు రీ ఎంట్రీ!

29-07-2021 Thu 17:04
  • సీనియర్ హీరోగా క్రేజ్
  • తగ్గిన అవకాశాలు
  • కొంతకాలంగా సినిమాలకు దూరం
  • ఈ సినిమాలో కీలకపాత్ర    
Venu Thottempudi in Raviteja movie

రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగులో సీనియర్ హీరో వేణు జాయిన్ కానున్నాడు.

హీరో వేణు అనగానే ఆయన చేసిన 'స్వయంవరం' .. 'చిరునవ్వుతో' .. 'హనుమాన్ జంక్షన్' .. 'పెళ్లాం ఊరెళితే' సినిమాలు గుర్తుకు వస్తాయి. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అవకాశాలు తగ్గుతున్న సమయంలో ముఖ్యమైన పాత్రలను కూడా చేశాడు.

ఆ తరువాత సినిమాలకు దూరమైన వేణు, మళ్లీ ఇప్పుడు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. షూటింగుకు ఆయనకు వెల్ కమ్ చెబుతూ, ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమాలో వేణు పోషించే పాత్ర ఏమిటో .. దాని తీరుతెన్నులు ఎలాంటివో చూడాలి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.