పులి బొమ్మ మాస్కు, టోపీతో సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

29-07-2021 Thu 17:04
  • ఇవాళ ప్రపంచ పులుల దినోత్సవం 
  • తాడేపలి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం
  • పులుల చిత్రాల పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం
  • పులుల సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని వెల్లడి
CM Jagan attends Global Tigers Day celebrations at Tadepalli camp office

ఇవాళ ప్రపంచ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పులిబొమ్మ ముద్రించిన ప్రత్యేక మాస్కు, టోపీ ధరించి అలరించారు. అంతేకాదు, 63 పులుల చిత్రాలతో కూడిన పుస్తకాన్ని, పోస్టర్లను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులతో కలిసి సీఎం జగన్ ఆవిష్కరించారు.

పులుల సంరక్షణలో అధికారులు మున్ముందు కూడా ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు.