Mary Kom: టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్ ముంగిట మేరీ కోమ్ ఓటమి

Mary Kom loses in Tokyo Olympics pre quarters
  • టోక్యో ఒలింపిక్స్ లో ముగిసిన మేరీకోమ్ ప్రస్థానం
  • ప్రీక్వార్టర్స్ లో పరాజయం
  • 3-2తో నెగ్గిన కొలంబియా బాక్సర్
  • శక్తిమేర పోరాడినా దక్కని ఫలితం
టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలన్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో నేడు జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్ లో మేరీ కోమ్ ఓటమిపాలైంది. కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది.

ఆరు పర్యాయాలు వరల్డ్ చాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ ఈ బౌట్ లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థికి దీటుగానే పంచ్ లు కురిపించినా, పలు రౌండ్లలో కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వాలెన్సియా ఆధిపత్యం సాగించింది.
Mary Kom
Lose
Toky Olympics
Boxing
India

More Telugu News