Jeevan Reddy: మధుయాష్కీకి సౌండ్ ఎక్కువ, సబ్జెక్ట్ తక్కువ: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

TRS MLA Jeevan Reddy fires on Congress leader Madhu Yashki Goud
  • మధుయాష్కీపై జీవన్ రెడ్డి ఫైర్
  • కేసీఆర్ ను తిడితే గొప్పవాళ్లవుతారా? అంటూ వ్యాఖ్యలు
  • "కచరా" వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని డిమాండ్
  • లేదంటే ఎక్కడికెళ్లినా అడ్డుకుంటామని హెచ్చరిక  
కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. మధుయాష్కీకి సౌండ్ ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ అని విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే మధుయాష్కీని ప్రజలు ఉరికొంచి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ ను "కచరా" అంటూ చేసిన వ్యాఖ్యలను మధుయాష్కీ ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారి నోరు తెరిచి ఊదితే ఆ గాలికి మధుయాష్కీ కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కు సాటి వచ్చే నేతలు విపక్షాల్లో ఎవరూ లేరని, అందుకే కేసీఆర్ కుటుంబాన్ని తిడితే గొప్పవాళ్లు అయిపోవచ్చని అనుకుంటున్నారని మండిపడ్డారు. మధుయాష్కీ అమెరికా నేర చరిత్ర గురించి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఓ రాజకీయ పర్యాటకుడిలా ఆర్నెల్లకోసారి నిజామాబాద్ వచ్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసే మధుయాష్కీ అవినీతి గురించి మాట్లాడితే, అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని జీవన్ రెడ్డి విమర్శించారు.
Jeevan Reddy
Madhu Yaskhi
CM KCR
Nizamabad
TRS
Congress
Telangana

More Telugu News