Atchannaidu: ధాన్యం బకాయిల విడుదలలో జగన్ నెలల తరబడి ఆలస్యం చేశారు: అచ్చెన్నాయుడు

Atchannaidu alleges CM Jagan delayed pending bills for paddy farmers many months
  • ధాన్యం రైతుల పరిస్థితిపై అచ్చెన్న ఆవేదన
  • ధాన్యం రైతులు ఎంతో నష్టపోయారని వెల్లడి
  • అన్నదాతలు రోడ్డెక్కారని వివరణ
  • వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్
ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. ధాన్యం బకాయిల విడుదలలో జగన్ నెలల తరబడి ఆలస్యం చేశారని ఆరోపించారు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ధాన్యం రైతులు నష్టపోయారని వెల్లడించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు.
Atchannaidu
CM Jagan
Pending Bills
Paddy Farmers
Andhra Pradesh

More Telugu News