రాజ్ కుంద్రా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: షెర్లిన్ చోప్రా

29-07-2021 Thu 14:24
  • 2019లో రాజ్ కుంద్రాతో బిజినెస్ మీటింగ్ జరిగింది
  • ఆ తర్వాత చెప్పాపెట్టకుండా మా ఇంటికి వచ్చాడు
  • ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు
Raj Kundra sexually misbehaved with me says Sherlyn Chopra

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇబ్బందులు మరింత పెరిగాయి. రాజ్ కుంద్రా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్ కుంద్రా పోర్నోగ్నఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షెర్లిన్ చోప్రాకు వారు సమన్లు పంపించారు. మరోవైపు రాజ్ కుంద్రాపై ఏప్రిల్ నెలలోనే షెర్లిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2019లో తన బిజినెస్ మేనేజర్ కు రాజ్ కుంద్రా ఫోన్ చేశారని... 2019 మార్చ్ 27న తమ మధ్య బిజినెస్ మీటింగ్ జరిగిందని ఫిర్యాదులో ఆమె తెలిపింది. ఆ తర్వాత ఒక రోజు చెప్పాపెట్టకుండా రాజ్ కుంద్రా తన ఇంటికి వచ్చాడని... తాను వారిస్తున్నా పట్టించుకోకుండా తనను కిస్ చేయడం మొదలు పెట్టాడని ఫిర్యాదులో షెర్లిన్ పేర్కొంది.

పెళ్లయిన వ్యక్తితో సంబంధాన్ని తాను కోరుకోలేదని... అదే విధంగా శారీరక సుఖాలను బిజినెస్ తో ముడిపెట్టాలని కూడా అనుకోలేదని తెలిపింది. తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో స్ట్రెస్ కు గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేసిందని... రాజ్ ను తోసేసి వాష్ రూమ్ కు పారిపోయానని తెలిపింది.