Yash: 'కేజీఎఫ్ 2' నుంచి సంజయ్ దత్ స్పెషల్ పోస్టర్!

  • విడుదలకి సిద్ధమైన 'కేజీఎఫ్ 2'
  • యష్ జోడీగా శ్రీనిధి శెట్టి
  • అధీరా పాత్రలో సంజయ్ దత్
  • త్వరలోనే ఖరారు కానున్న విడుదల తేదీ
K G F new poster released

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' సినిమా రూపొందింది. 'కేజీఎఫ్' సాధించిన సంచలన విజయం .. రికార్డుస్థాయి వసూళ్ల కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యష్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో, సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. విలన్ 'అధీరా'గా ఆయన విజృంభించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఈ రోజున సంజయ్ దత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన లుక్ కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఖడ్గాన్ని భుజాన వేసుకుని ధైర్యంగా ముందుకు నడుస్తూ ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. పోస్టర్లో ఆయన లుక్ ను బట్టే, ఆ పాత్ర ఎంత రఫ్ గా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఆయన పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

యాక్షన్ తో పాటు ఎమోషన్స్ తో కొనసాగే ఈ సినిమాలో, యష్ జోడీగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది. తెలుగు నుంచి ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇంకా రవీనా టాండన్ ప్రత్యేక పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News