Vizag Steel Plant: కేంద్ర ప్ర‌భుత్వ అఫిడ‌విట్‌పై విశాఖ స్టీల్ ప్లాంట్ వ‌ద్ద ఉద్యోగుల ఆందోళ‌న‌.. ఉద్రిక్త‌త‌

steel plant empoyees agitation against govt
  • స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామన్న కేంద్రం
  • స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం  
  • ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన  
విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో పిటిష‌న్ వేయ‌గా, నిన్న కేంద్ర స‌ర్కారు కౌంట‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ ఈ మేర‌కు నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో చెప్పింది. దీంతో  కేంద్ర స‌ర్కారు దాఖ‌లు చేసిన‌ అఫిడివిట్‌ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టీల్‌ప్లాంట్‌లో ఈ రోజు ఉద‌యం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉద్యోగస్తులు పరిపాలన భవనం వద్దకు చేరుకోవ‌డంతో అక్క‌డ‌ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు వెళుతున్న ఇత‌ర‌ కార్మికులను ఉద్యోగస్తులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్క‌డ పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌పై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.
Vizag Steel Plant
Vizag
NDA

More Telugu News