Prabhas: 'రాధే శ్యామ్' నుంచి రానున్న అప్డేట్!

Radhe Shyam movie update
  • ప్రభాస్ తాజా చిత్రంగా 'రాధే శ్యామ్'
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ
  • పాన్ ఇండియా స్థాయిలో విడుదల
  • అందరిలో పెరుగుతున్న ఆసక్తి  
ప్రభాస్ - పూజ హెగ్డే నాయకా నాయికలుగా 'రాధే శ్యామ్' రూపొందింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. విదేశీ నేపథ్యంలో సాగే పునర్జన్మలతో కూడిన ప్రేమకథ ఇది. పాన్ ఇండియా స్థాయి సినిమా కావడం .. గ్రాఫిక్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండటం వలన, ఈ ప్రాజెక్టు ఎక్కువ సమయాన్ని తీసుకుంది.  

ఈ సినిమా పట్టాలెక్కిన దగ్గర నుంచి అప్ డేట్స్ పెద్దగా వదల్లేదు. చాలా సమయం తరువాత ఒకటి రెండు పోస్టర్లు వదిలారు. ఆ తరువాత కూడా అప్ డేట్స్ పరంగా మరింత గ్యాప్ తీసుకున్నారు. షూటింగు ఆలస్యం కావడం .. రీ షూట్లు జరుగుతున్నాయనే టాక్ రావడం కొంత అసహనానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఇక ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో అప్ డేట్ ను వదలనున్నట్టు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చేశాడు. మరి ఆ అప్డేట్ ఏ రూపంలో ఉండనుందనేది చూడాలి. 'సాహో' తరువాత ప్రభాస్ నుంచి రానున్న సినిమా ఇదే. ఇక్కడి నుంచే ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల వరుస మొదలుకానుంది. దాంతో సహజంగానే అందరిలో ఆసక్తి మొదలవుతోంది.    
Prabhas
Pooja Hegde
Radhakrishna Kumar

More Telugu News