Princess Diana: 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన ప్రిన్సెస్ డయానా మేనకోడలు.. ఫొటోలు వైరల్

Inside The Dreamy Wedding Of Princess Dianas Niece
  • ఈ నెల 24న ఘనంగా వివాహం
  • కిట్టీ పెళ్లాడిన మైఖేల్ వేల కోట్ల సంపన్నుడు
  • 2018 నుంచే ఇద్దరి మధ్య పరిచయం
మూడు పదుల వయసు కూడా దాటని ప్రిన్సెస్ డయానా మేనకోడలు లేడీ కిట్టీ స్పెన్సర్స్ 62 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకోవడం సంచలనమైంది. వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వీరి పెళ్లిపై నెటిజన్లు చలోక్తులు విసురుతూ నవ్వు పుట్టిస్తున్నారు.

 కిట్టీ పెళ్లాడిన ఆ వృద్ధుడి పేరు మైఖేల్ లూయిస్. దక్షిణాఫ్రికాకు చెందిన ఆయన ఫ్యాషన్ వ్యాపారవేత్త. వేల కోట్ల సంపన్నుడు. 2018 నుంచే వీరిమధ్య పరిచయం ఉండగా, అది ప్రేమగా మారింది. దీంతో ఈ నెల 24న ఇటలీలోని ప్రాస్కాటిలోని విలలా అల్డోబ్రాండినిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డోల్స్ అండ్ గబ్బానా రూపొందించిన గౌన్లు ధరించిన కిట్టీ పెళ్లి వేడుకలో మెరిసిపోయింది. కాగా, లేడీ కిట్టీ.. ప్రిన్సెస్ డయానా సోదరుడు చార్లెస్ స్పెన్సర్ కుమార్తె.
Princess Diana
Lady Kitty Spencer
Michael Lewis
Wedding

More Telugu News