CBI: జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా

jagan inappropriate assets case trial adjourned to august 6th
  • హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలంటూ జగతి పబ్లికేషన్స్ మెమో
  • సమ్మతించిన కోర్టు
  • వచ్చే నెల 4కు వాయిదా పడిన ఎమ్మార్ కేసు విచారణ
  • ఇండియా సిమెంట్స్ కేసులో వాదనలకు సిద్ధంగా ఉండాలని న్యాయవాదులకు ఆదేశం
అక్రమాస్తుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఈడీ నమోదు చేసిన కేసులో విచారణ ఆగస్టు 6వ తేదీకి వాయిదా పడింది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులపై విచారణ చేపట్టొచ్చంటూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను నిలిపివేయాలన్న జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన మెమోను పరిశీలించిన సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది.

మరోవైపు ఎమ్మార్ కేసు విచారణ ఆగస్టు 4కు వాయిదా పడింది. కాగా, ఇండియా సిమెంట్స్ కేసులో  వాదనలకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన నిందితుడు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఐఏఎస్ శామ్యూల్ సహా రఘురాం సిమెంట్స్/భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ లిమిటెడ్ తరపు న్యాయవాదులను సీబీఐ కోర్టు ఆదేశించింది.
CBI
ED
Jagan
Emmar Case
Andhra Pradesh
Inappropriate Assets case

More Telugu News