Telangana: నాగార్జునసాగర్‌లో వచ్చే నెల 2న కేసీఆర్ పర్యటన

Telangana cm kcr to visit nagarjuna sagar on august 2nd
  • సాగర్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ వస్తానన్న సీఎం
  • ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు పర్యటన
  • అభివృద్ధి పనులు, హామీల అమలుపై సమీక్ష
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో మరోమారు పర్యటిస్తానంటూ అప్పట్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోనున్నారు. ఆగస్టు 2న ఆయన నాగార్జునసాగర్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది.

ఉప ఎన్నిక సందర్భంగా అప్పట్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించనున్నారు.

Telangana
KCR
Nagarjuna Sagar

More Telugu News