Kodali Nani: ఇలాంటి పనులు చేస్తే చంద్రబాబును కూడా పోలీసులు వదలరు: ఏపీ మంత్రి కొడాలి నాని

Kodali nani comments on Devineni Uma arrest
  • దేవినేని ఉమా ఉద్దేశపూర్వకంగా అక్కడకు వెళ్లి ప్రజలను దుర్భాషలాడారు
  • పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు
  • నేను పుట్టక ముందు నుంచి అక్కడ క్వారీలు ఉన్నాయి
టీడీపీ నేత దేవినేని ఉమాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ఉద్దేశ పూర్వకంగానే దేవినేని ఉమ అక్కడకు వెళ్లి, అక్కడి ప్రజలను దుర్భాషలాడారని అన్నారు. దళితులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా, వారిపై దాడి కూడా చేశారని చెప్పారు. పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని అన్నారు.

ఆ ప్రాంతంలో తాను పుట్టక ముందు నుంచే క్వారీలు ఉన్నాయని... టీడీపీ హయాంలో ఎక్కువ మైనింగ్ జరిగిందని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు గోబెల్స్ అయితే దేవినేని ఉమా అంతకు మించి అని విమర్శించారు. చంద్రబాబు, ఉమాలాంటి వారి మాటలను రైతులు నమ్మవద్దని కోరారు. ఏపీలో అవినీతి చక్రవర్తి చంద్రబాబు మాత్రమేనని... ఇలాంటి పనులు చేస్తే ఉమానే కాకుండా చంద్రబాబును కూడా పోలీసులు వదలరని అన్నారు. తమ పార్టీ నేత కారు అద్దాలు పగిలితే... దాన్ని ఎల్లో మీడియా వాళ్లు ఉమా కారుగా చూపించారని మండిపడ్డారు.
Kodali Nani
YSRCP
Chandrababu
Devineni Uma
Telugudesam

More Telugu News