జగన్, విజయసాయిరెడ్డి వాదనలకు సిద్ధం కావాలంటూ సీబీఐ కోర్టు ఆదేశం

28-07-2021 Wed 20:36
  • ఇండియా సిమెంట్స్ కేసును విచారించిన సీబీఐ, ఈడీ కోర్టు
  • అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలని ఆదేశం
  • శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటర్ వేయడానికి గడువు కోరిన సీబీఐ
CBI court adjourns Jagans case to August 6

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఇండియా సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈరోజు సీబీఐ, ఈడీ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్ పై కౌంటరు వేయడానికి సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ కేసు తదుపరి విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది.