ఏపీలో తాజాగా 2,010 కరోనా కేసుల నమోదు

28-07-2021 Wed 18:19
  • తూర్పుగోదావరిలో అత్యధికంగా 386 కేసులు  
  • రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 20,999
Corora cases in AP increasing

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 1540 కరోనా కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 2 వేలు దాటాయి. 24 గంటల్లో 2,010 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 20 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 386 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,956 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,59,942 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,25,631 మంది కోలుకున్నారు. 13,312 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులు ఉన్నాయి.