'ఎస్.ఆర్.కల్యాణ మండపం' నుంచి ట్రైలర్ రిలీజ్!

  • ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథ 
  • కిరణ్ జోడీగా ప్రియాంక 
  • కీలక పాత్రలో సాయికుమార్ 
  • ఆగస్టు 6వ తేదీన విడుదల    
S R Kalyana mandapam trailer released

తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఎమోషన్స్ తో కూడిన మరో ప్రేమకథ రూపొందింది .. ఆ సినిమా పేరే 'ఎస్.ఆర్. కల్యాణమండపం'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన జోడీగా ప్రియాంక జవాల్కర్ అలరించనుంది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి .. సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఇది తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా సాగే కథ అని తెలుస్తోంది. అలాగే మరో వైపున తాను ఇష్టపడిన అమ్మాయి ప్రేమను పొందడానికి హీరో ఏం చేశాడనే ఆసక్తికరమైన మలుపుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో సాయికుమార్ .. తల్లి పాత్రలో తులసి నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి .. శ్రీకాంత్ అయ్యంగార్ కనిపిస్తున్నారు. లవ్ .. యాక్షన్ ... ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, ఆగస్టు 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రియాంక జవాల్కర్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News