ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా
- రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న నారాయణస్వామి
- ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ
- ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో, ఈ రోజు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు.