పవన్ - రానా సినిమా టైటిల్ పై అందరిలోనూ ఆసక్తి!

28-07-2021 Wed 14:03
  • షూటింగు దశలో మలయాళ రీమేక్
  • భీమ్లా నాయక్ పాత్రలో పవన్
  • త్వరలో రివీల్ కానున్న రానా లుక్
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
Pavan and Rana combo movie update
పవన్ - రానా కథానాయకులుగా ఒక సినిమా రూపొందుతోంది. సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. కరోనా కారణంగా కొంతకాలంగా ఆగిపోయిన షూటింగు మళ్లీ ఇప్పుడు మొదలైంది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ లుక్ ను రివీల్ చేస్తూ, ఆయన పాత్ర పేరు 'భీమ్లా నాయక్' అనే విషయాన్ని వెల్లడించారు. ఇక రానా పాత్ర ఏమిటనేది చెప్పాల్సి ఉంది. మలయాళంలో ప్రధానమైన రెండు పాత్రల పేర్లను కలుపుతూ టైటిల్ పెట్టారు. తెలుగులో కూడా అలాగే టైటిల్ ను సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువలన రానా పాత్ర పేరు ఎప్పుడు రివీల్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ ఉన్నాడు. వచ్చేనెలలో టైటిల్ పోస్టర్ ను వదలాలనే ఆలోచనలో ఉన్నారట. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు .. ఆ రోజున ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.