Andhra Pradesh: రాత్రిపూట పరిశీలనకు వెళతారా.. అడిగితే దాడి చేస్తారా?: దేవినేని ఉమపై మల్లాది విష్ణు ఫైర్​

Malladi Vishnu Critical Against Devineni Uma Questions His Presence At Midnight
  • అక్రమాలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు
  • జక్కంపూడిలో ప్రజలే తరిమికొట్టిన విషయం గుర్తుంచుకోండి 
  • ఉమ రాజకీయ నాయకుడే కాదు, గోబెల్స్ అని కామెంట్ 
వసంత కృష్ణప్రసాద్ చేతిలో పొందిన ఓటమిని దేవినేని ఉమ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలు ఛీ కొట్టినా ఆయన బుద్ధి మారడం లేదని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. మైనింగ్ లో అక్రమాలు జరిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ.. అర్ధరాత్రి పరిశీలనకు వెళతారా? అని ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.

రాత్రిపూట పరిశీలనకు వెళ్లిన ఉమను నిలదీసినందుకు వైసీపీ నేతలపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ డ్రామాలను ఇకనైనా ఆపాలని మండిపడ్డారు. వసంత కృష్ణప్రసాద్ పై బురదజల్లేందుకు నాటకాలు ఆడుతున్నారన్నారు. జక్కంపూడిలో ప్రజలే దేవినేనిని తరిమికొట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన రాజకీయ నాయకుడే కాదని, గోబెల్స్ అని మండిపడ్డారు.

చంద్రబాబు, దేవినేనిలు డ్రామా ఆర్టిస్టులు: జోగి రమేశ్  

ఆయన దేవినేని ఉమ కాదని, సొల్లు ఉమ అని వైసీపీ మరో ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబు, దేవినేనిలు డ్రామా ఆర్టిస్ట్ లని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి, గులకరాళ్లను దోచుకున్నారని మండిపడ్డారు. దేవినేనిపై ఏ దాడి జరగలేదని, ఆయనతో ఉన్న గూండాలే దాడి చేశారని చెప్పారు.
Andhra Pradesh
Malladi Vishnu
Jogi Ramesh
Devineni Uma
YSRCP

More Telugu News