కేటీఆర్​ కు శ్రీనివాస్​ గౌడ్​ కానుక.. తనకెంతో అపురూపమైనదన్న కేటీఆర్​!

28-07-2021 Wed 13:26
  • కేసీఆర్, శోభ దంపతుల పంచలోహ చిత్రపటం బహూకరణ  
  • తన కూతుర్లతో కలిసి ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్
  • ఇద్దరు శిల్పులు మూడు నెలల్లో తయారు చేశారని వెల్లడి
Srinivas Goud Gifts KTR a Memorable Photo

పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ కు ఓ అపురూపమైన కానుక అందింది. తన సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ అపురూపమైన కానుకను అందించారు. కేటీఆర్ తల్లిదండ్రులు కేసీఆర్, శోభ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని తన కూతుర్లు శ్రీహిత, శ్రీహర్షితలతో కలిసి ప్రగతి భవన్ లో కానుకగా ఆయనకు అందజేశారు.


ఇద్దరు శిల్పులు మూడు నెలల పాటు శ్రమించి ఈ ఫొటోను తయారు చేశారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్ పుట్టిన రోజు నాడు మహబూబ్ నగర్ లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు ప్రత్యేక బైకులను పంపిణీ చేశామన్నారు. కాగా, ఈ కానుక తనకు ఎంతో ప్రత్యేకమని, అపురూపమైనదని కేటీఆర్ అన్నారు. శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.