నీలి చిత్రాల కేసులో శిల్పా శెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు: పోలీసులు

28-07-2021 Wed 10:37
  • కొన‌సాగుతోన్న విచార‌ణ‌
  • మ‌రికొంద‌రిపై కేసులు
  • న‌లుగురు నిర్మాత‌ల‌పై కేసులు
  • గెహ‌నా వ‌శిష్ట పేరు చేర్పు
police on shilpa shetty case

సినీ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను పోర్నోగ్రఫీ (నీలి చిత్రాలు)కి సంబంధించిన కేసులో ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కుంద్రాను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ప‌లు వివ‌రాలు రాబట్టారు.

మరోపక్క శిల్పాశెట్టికి ఈ కేసుతో ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని వ‌స్తోన్న వార్త‌ల‌పై పోలీసులు స్పందించారు. కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం తాము కుంద్రాకు చెందిన వియాన్ ఇండ‌స్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు చెప్పారు.  

వియాన్ ప‌రిశ్ర‌మే పోర్న్ రాకెట్‌లో కీల‌కంగా ఉంది. దానికి శిల్పా శెట్టి డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. శిల్పాశెట్టి అకౌంట్లోకి మాత్రం డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు కుంద్రా అకౌంట్లోకి మాత్రం 1.17 కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్లు ఆడిట‌ర్స్ గుర్తించారు.

మ‌రోవైపు, రాజ్‌కుంద్రా పోర్నోగ్ర‌ఫీ వ్య‌వ‌హారంలో మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న కంపెనీకి చెందిన న‌లుగురు నిర్మాత‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. సినీ న‌టి గెహ‌నా వ‌శిష్ట పేరును కూడా చేర్చిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.