జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

28-07-2021 Wed 09:10
  • నాసెన్స్ రసాయన పరిశ్రమలో ప్రమాదం
  • రసాయనాలకు అంటుకుని విస్తరిస్తున్న మంటలు
  • మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
fire accident in Hyderabad jeedimetla IDA

హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలోని రసాయనాలకు మంటలు అంటుకోవడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.