సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-07-2021 Wed 07:52
  • ఆ పాటలు కష్టమంటున్న కథానాయిక 
  • టైమ్ మెషీన్ కాన్సెప్టుతో శర్వానంద్
  • తెలంగాణ యాస నేర్చుకుంటున్న నాని    
Nidhi Agarwal says no to rain songs

*  వర్షం పాటలకు తాను చాలా దూరంగా ఉంటానని అంటోంది కథానాయిక నిధి అగర్వాల్. 'వర్షం పాటలలో నటించడం చాలా కష్టం. పైనుంచి వర్షం పడుతుంటే కళ్లు తెరిచి భావాలు పలికించడం నా వల్ల అయ్యేపనికాదు. అందుకే, ఇలాంటి పాటలు చేయనని ముందే చెప్పేస్తాను" అని చెప్పింది నిధి.
*  ప్రస్తుతం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో నటిస్తున్న హీరో శర్వానంద్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది టైమ్ మెషీన్ కాన్సెప్టుతో నడిచే కథ అని సమాచారం. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు.
*  తాజాగా 'అంటే .. సుందరానికీ' చిత్రాన్ని చేస్తున్న నేచురల్ స్టార్ నాని దీని తర్వాత నూతన దర్శకుడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో ఆయన తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తాడు. దీంతో తెలంగాణ యాసపై పట్టు కోసం నాని ప్రస్తుతం ఓ ట్యూటర్ ని పెట్టుకుని యాసని ప్రాక్టీస్ చేస్తున్నాడట.