ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే యాంటీబాడీలపై బ్రిటన్ అధ్యయనం.. సంచలన విషయాల వెల్లడి
- రెండుమూడు నెలలకే క్షీణిస్తున్న యాంటీబాడీలు
- వైద్య పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయన వివరాలు
- కొవిషీల్డ్‌తో 93 శాతం రక్షణ లభిస్తోందన్న మరో అధ్యయనం
పైన చెప్పిన టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న మధుమితా శ్రోత్రి తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మరోవైపు, భారత్‌లో ఇస్తున్న కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం నిన్న విడుదల చేసింది.