తెలంగాణలో మరో 645 మందికి కరోనా పాజిటివ్

27-07-2021 Tue 20:33
  • గత 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు
  • ఖమ్మం జిల్లాలో, జీహెచ్ఎంసీ పరిధిలో 72 చొప్పున కేసులు
  • నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో నలుగురి మృతి
Telangana covid update

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,23,166 నమూనాలు పరీక్షించగా, 645 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో 72, జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 58, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు గుర్తించారు. నారాయణపేట్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 729 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,42,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,29,408 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,237 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,791కి పెరిగింది.