సరదాగా వాలీబాల్ ఆడిన ఎన్టీఆర్, రాజమౌళి

27-07-2021 Tue 19:07
  • ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్
  • షూటింగ్ గ్యాప్ లో వాలీబాల్ మ్యాచ్
  • రెండు జట్లుగా విడిపోయిన యూనిట్ సభ్యులు
  • సోషల్ మీడియాలో వీడియో సందడి
NTR and Rajamouli plays volleyball

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, బయట కూడా ఎంతో చురుగ్గా ఉంటారు. సెట్స్ పై ఎన్టీఆర్ ఉంటే ఆ సందడే వేరు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా, షూటింగ్ గ్యాప్ లో రాజమౌళితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడాడు. ఇతర యూనిట్ సభ్యులు కూడా కలవడంతో, రెండు జట్లుగా విడిపోయి వాలీబాల్ మ్యాచ్ ఆడారు. సెంటర్ ప్లేసులో నిల్చున్న ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా వాలీబాల్ ను అవతలి కోర్టులోకి తరలిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.