ఈఏపీ సెట్ లో ఇంటర్ వెయిటేజి మార్కుల తొలగింపు

27-07-2021 Tue 18:50
  • ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి
  • కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు
  • ఎంట్రన్స్ టెస్టు మార్కుల ఆధారంగానే ఈసారి ప్రవేశాలు
  • ఉన్నత విద్యామండలి ప్రకటన
No Inter weightage marks this year in EAPCET

ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈఏపీ సెట్ (గతంలో ఎంసెట్) అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏపీ సెట్ లో ఇంటర్ వెయిటేజి మార్కులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఇస్తున్నారు. ఇకపై అది వర్తించబోదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈఏపీ సెట్ ద్వారా ప్రవేశాలు పూర్తిగా రాత పరీక్ష మార్కుల ఆధారంగానే జరుగుతాయని వెల్లడించింది.