గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ విజయం
- నేడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలు
- మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్
- ఆపై ఓట్ల లెక్కింపు
- విజయం సాధించిన వైసీపీ కార్పొరేటర్లు
ఓ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ ఎంతో కీలకమైనది. దీనికి మేయర్ నాయకత్వం వహిస్తారు. ఇందులో 10 మంది డైరెక్టర్లుగా కొనసాగుతారు. తాజా ఎన్నికల ద్వారా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అందరూ వైసీపీ కార్పొరేటర్లే గెలిచారు. కాగా, ఈ విజయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వెలిబుచ్చారు. పరిషత్ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.