మరో థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కించిన నయనతార!

  • తమిళనాట భారీ క్రేజ్
  • తెలుగులోను మంచి ఇమేజ్
  • రిలీజ్ కి రెడీగా 'నేత్రికన్'
  • కొత్త దర్శకుడితో మరో సస్పెన్స్ థ్రిల్లర్
Nayanatara new movie is a suspence thriller

తమిళనాట నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. కెరియర్ ను మొదలెట్టిన కొంతకాలం వరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన నయనతార, ఆ తరువాత నటనకు ప్రాధాన్యతను ఇవ్వడం మొదలెట్టింది. ఆ తరువాత నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా ఎంచుకోవడం ఆరంభించింది.

అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ఆమె తనకి తిరుగులేదనిపించుకుంది. ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాలలో విజయాన్ని సాధించిన వాటి శాతం ఎక్కువ. తమిళంలోనే కాకుండా తెలుగులోను ఆ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.

తమిళంలో ఇటీవల ఆమె చేసిన 'నేత్రికన్' విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే , నయనతార మరో సస్పెన్స్ థ్రిల్లర్ ను పట్టాలెక్కించింది. వెంకట్ ప్రభు దగ్గర సహాయకుడిగా పనిచేసిన జీఎస్ విఘ్నేశ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. చెన్నైలో తొలి షెడ్యూల్ షూటింగును జరుపుకున్న ఈ సినిమా, కోయంబత్తూరులో జరగనున్న రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చేయనున్నారు.

More Telugu News