అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు: సీఎం జగన్

27-07-2021 Tue 17:28
  • అధికారులతో సీఎం జగన్ స్పందన సమీక్ష
  • ఆగస్టు 10 నేతన్న నేస్తం
  • ఆగస్టు 16న విద్యాకానుక
  • ఆగస్టు 27న పరిశ్రమల ప్రోత్సాహకాల విడుదల
CM Jagan reviews on Spandana program

ఏపీ సీఎం జగన్ ఇవాళ స్పందన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు హాజరైన ఈ కార్యక్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. అగ్రిగోల్డ్ లో రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేస్తామని తెలిపారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక నిధుల విడుదల ఉంటుందని వివరించారు. ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ఆగస్టు 27న ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధం అవ్వాలని సీఎం జగన్ సూచించారు.