తమిళనాడులో నరమాంస భక్షకుల కలకలం

27-07-2021 Tue 15:54
  • తెన్ కాశి జిల్లాలో ఓ గుడిలో ఉత్సవం
  • మనిషి మాంసం తింటూ కనిపించిన వ్యక్తులు
  • పుర్రెతో నృత్యాలు
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
  • వీడియో ఆధారంగా కేసు నమోదు
Cannibalism in a Tamilnadu village

తమిళనాడులోని తెన్ కాశి జిల్లాలో నరమాంస భక్షకుల కలకలం చెలరేగింది. నరమాంసం తిన్నారన్న అభియోగంపై 10 మందిపై కేసు నమోదైంది. ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కల్లూరణి గ్రామంలో ఓ గుడిలో ఉత్సవం జరుగుతున్న సందర్భంగా కొందరు నరమాంసం తింటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వ్యక్తులు మనిషి మాంసం తింటూ పుర్రెతో నృత్యాలు చేస్తూ భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.