శిల్పాశెట్టి భర్తకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

27-07-2021 Tue 15:24
  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
  • బెయిల్ పిటిషన్ పై రేపు బాంబే హైకోర్టులో విచారణ
  • ఇప్పటికే శిల్పా శెట్టి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు
Raj Kundra sent to 14 day judicial custody

వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు షాకిచ్చింది. కుంద్రాకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాప్స్ ద్వారా పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారనే అభియోగాలతో ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై రేపు బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది.

రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నివాసంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అయితే తన భర్త అమాయకుడని శిల్పా శెట్టి పోలీసు అధికారులతో అన్నట్టు సమాచారం. తన భర్త ఎరోటిక్ కంటెంట్ ను మాత్రమే అప్ లోడ్ చేశాడని, పోర్న్ కంటెంట్ ని కాదని ఆమె తెలిపింది.