అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా అశోక్‌?: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

27-07-2021 Tue 13:26
  • 12 విద్యా సంస్థల సిబ్బంది జీతాల సంగతేంటి
  • పదవి కావాలి కానీ, బాధ్యతలు పట్టించుకోవా?
  • బోర్డును సమావేశపర్చకుండా ఈ కుట్రలేమిటి?
  • నిధులు లేక జీతాలు ఆగిపోయాయి
vijay sai reddy slams tdp

మాన్సాస్ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. మాన్సాస్ అధీనంలోని 12 విద్యా సంస్థల సిబ్బంది జీతాల సంగతేంటి అశోక్? పదవి కావాలి కానీ, బాధ్యతలు పట్టించుకోవా? బోర్డును సమావేశపర్చకుండా ఈ కుట్రలేమిటి? నిధులు లేక జీతాలు ఆగిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే ఎలా? అని విజ‌య‌సాయిరెడ్డి నిల‌దీశారు.

టీడీపీ నేత నారా లోకేశ్ పై కూడా విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ''పార్టీ లేదు...బొక్కా లేద'ని అచ్చన్న ఆనాడే చెప్పాడు. ఇడ్లీలో చెట్నీ వేసుకుని తింటూ అలా చెప్పడమేంటని 'పప్పు బాబు'కు పొడుచుకొచ్చింది. సీట్లకే కాదు 14 శాతం ఓట్లకు బొక్కపడింది. ఈసారి పప్పు తింటూ 'పప్పు లేదూ...పార్టీ లేదని' చెప్పాలేమో?' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.