శిల్పా శెట్టి ఏడ్చేసింది.. భర్తపై అరిచేసింది: పోర్నోగ్రఫీ కేసు విచారణ అధికారుల వెల్లడి

27-07-2021 Tue 12:41
  • కుటుంబాన్ని దోషిగా నిలిపావంటూ ఆగ్రహం
  • ఎండార్స్ మెంట్లన్నీ రద్దయ్యాయని ఆవేదన
  • ఇకపై ఆమెను విచారించబోమన్న అధికారులు
Shilpa Shetty Broke Down When Officials Reach Her Home and Shouts At Her Husband

పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి శిల్పా శెట్టి కన్నీటి పర్యంతమైంది. గత శుక్రవారం విచారణ నిమిత్తం ఇంటికి వెళ్లగా.. ఆమె పెద్దగా ఏడ్చేసిందని అధికారులు తాజాగా చెప్పారు. అంతేగాకుండా భర్త రాజ్ కుంద్రాపై ఆగ్రహంతో ఊగిపోయిందని అన్నారు. హాట్ షాట్స్ తో తనకే సంబంధమూ లేదని ఆమె పదే పదే చెప్పారని గుర్తు చేశారు.

ఈ వ్యవహారం మొత్తం కుటుంబాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిందని రాజ్ కుంద్రాపై ఆమె మండిపడిందని అన్నారు. వచ్చిన ఎండార్స్ మెంట్లన్నీ ఈ కేసు వల్ల వెనక్కు వెళ్లిపోయాయని, చాలా సంస్థలు వాటిని రద్దు చేశాయని చెప్పిందన్నారు. విచారణ సందర్భంగా.. తనకే పాపమూ తెలియదంటూ శిల్పకు రాజ్ కుంద్రా చెప్పాడని అధికారులు వివరించారు. అది పోర్న్ కాదని, కేవలం శృంగార చిత్రాలు మాత్రమేనని వివరించే ప్రయత్నం చేశాడన్నారు.

కాగా, ఈ కేసుతో శిల్పా శెట్టికి ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు స్పష్టం చేశారు. పోర్నోగ్రఫీలో ఆమె పాత్ర లేదన్నారు. కాబట్టి ఇకపై ఆమెను విచారించబోమని చెప్పారు.