వైఎస్ వివేక హ‌త్య కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన ముగ్గురు అనుమానితులు

27-07-2021 Tue 10:32
  • కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ‌
  • పులివెందుల‌కు చెందిన ఉద‌య్ కుమార్ రెడ్డి, ప్ర‌కాశ్ హాజ‌రు
  • తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ స‌తీశ్ కుమార్ రెడ్డి కూడా
cbi trial in veveka murder case

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో 51వ రోజు విచార‌ణ కొనసాగిస్తోంది. ఈ రోజు అధికారులు ముగ్గురు అనుమానితుల‌ను ప్రశ్నిస్తున్నారు. పులివెందుల‌కు చెందిన ఉద‌య్ కుమార్ రెడ్డి, ప్ర‌కాశ్ తో పాటు తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ స‌తీశ్ కుమార్ రెడ్డి కూడా విచార‌ణకు హాజ‌ర‌య్యారు.  

కొన్ని రోజులుగా కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలోనే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. పర్యవేక్షణ అధికారిని మారుస్తూ సీబీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది.