Tamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Tamanna to shake a leg with Varun Tej for Gani movie
  • తమన్నా మరోసారి ఐటెం సాంగ్ 
  • హారర్ థ్రిల్లర్ చేస్తున్న నాగ చైతన్య
  • వైష్ణవ్ తేజ్ తో బుచ్చిబాబు సినిమా
  • రెండు సంస్థలకు 'ఆర్ఆర్ఆర్' ఆడియో
*  గతంలో కొన్ని సినిమాలలో ఐటెం సాంగులు చేసిన అందాలతార తమన్నా తాజాగా మరో సినిమాలో కూడా చేయనుంది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'గని' సినిమాలో ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
*  అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా ఓటీటీ కోసం వెబ్ సీరీస్ చేస్తున్నాడు. విక్రంకుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందుతుంది. హారర్ థ్రిల్లర్ జోనర్ లో ఇది ఉంటుందని అంటున్నారు. శరత్ మరార్ దీనిని నిర్మిస్తున్నారు. 
*  'ఉప్పెన' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సనా త్వరలో వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ తో బుచ్చిబాబు చేయాల్సిన ప్రాజక్టుకి మరింత సమయం ఉండడంతో ఈలోగా వైష్ణవ్ తో సినిమాకి ప్లాన్ చేస్తున్నాడట. దీనిని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం.
*  రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆడియో రైట్స్ ను రెండు సంస్థలు కలసి దక్కించుకున్నాయి. టీ-సీరీస్, లహరి మ్యూజిక్ కలసి సంయుక్తంగా ఈ ఆడియో హక్కులను సొంతం చేసుకున్నాయి.
Tamanna
Varun Tej
Naga Chaitanya
Rajamouli

More Telugu News