Peddireddy: బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి

Former minister Peddireddy resigns for BJP
  • ఈటల చేరిన తర్వాత బీజేపీలో మారిన పరిణామాలు
  • పెద్దిరెడ్డి అసంతృప్తి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా
  • బండి సంజయ్ కి రాజీనామా లేఖ పంపిన వైనం
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు పంపించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి గత కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

ఇటీవల ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి మరింత దూరం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ నుంచి బీజేపీ టికెట్ ఆశించిన ఆయన, ఇటీవలి పరిణామాలతో నిరాశకు గురయ్యారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తనతో చర్చించకుండానే ఈటలను పార్టీలోకి తీసుకున్నారని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 
Peddireddy
BJP
Resignation
Telangana

More Telugu News