praveen kumar: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో నాపై దుష్ప్ర‌చారం జరుగుతోంది: మాజీ ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్

praveen kumar on huzurabad elections
  • కొంద‌రికి మద్దతు ఇస్తున్నట్లు ప్ర‌చారం
  • ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మ‌కండి  
  • అంబేద్క‌ర్ బాటలో నడిచేందుకు నేను సిద్ధం
  • హుజూరాబాద్ లో వెదజల్లుతోన్న‌ డబ్బును  అభివృద్ధికి ఖ‌ర్చు చేయాలి
హుజూరాబాద్ లో కొంద‌రికి తాను మద్దతు ఇస్తున్నట్లు తనమీద దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. త‌న‌పై వ‌స్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మ‌వద్దని కోరారు. అంబేద్క‌ర్ బాటలో నడిచేందుకు, ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ‌హుజ‌న, బ‌డుగు వ‌ర్గాల బాగు కోస‌మే తాను ప‌నిచేస్తాన‌ని తెలిపారు.  

త‌న‌ మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వారికే ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో వెదజల్లుతోన్న‌ డబ్బును అభివృద్ధికి వినియోగించాలని ఆయ‌న అన్నారు. తాను ఇప్ప‌టికే వీఆర్‌ఎస్‌ తీసుకున్నాన‌ని, ప్ర‌స్తుతం కొత్త‌ ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని చెప్పారు. ఈ స‌మ‌యంలో త‌న‌ను వివాదాలలోకి లాగవద్దని కోరారు. ఒక‌వేళ త‌న‌ను ఎవ‌రైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులవుతాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.
praveen kumar
Huzurabad
Telangana

More Telugu News