హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు ఆర్జేడీ ఎమ్మెల్యేలు!
- గత అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం
- ఆర్జేడీ ఎమ్మెల్యేలకు గాయాలు
- దీంతో నేడు వినూత్న రీతిలో నిరసన
కాగా, మార్చి 23న బీహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయడంతో అసెంబ్లీలోకి పోలీసులు ప్రవేశించడం పట్ల ఆర్జేడీ అప్పట్లో మండిపడింది. తమ ఎమ్మెల్యేలు కొంత మందికి గాయాలయ్యాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో హెల్మెట్లు పెట్టుకుని, ప్రథమ చికిత్స పెట్టెలు పట్టుకుని వచ్చి ఆర్జేడీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.