Rashmimka: అటు ఎక్కే ఫ్లైటు .. ఇటు దిగే ఫ్లైటుతో బిజీగా రష్మిక!

Adallu Meeku Joharlu movie update
  • ముగింపు దశలో 'పుష్ప'
  • ఇటీవలే మొదలైన కొత్త ప్రాజెక్టు
  • శర్వానంద్ జోడీగా తొలిసారి
  • సెట్స్ పై ఉన్న 'మిషన్ మజ్ను'
రష్మిక అదృష్టం మామూలుగా లేదు .. తెలుగులో ఆమె చేసిన సినిమాలు వరుసగా భారీ విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. గ్లామర్ తో తెరపై అల్లరి అమ్మాయిగా సందడి చేయడమే కాదు, ఎమోషనల్ సీన్స్ లోను ఆమె ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ ప్లేస్ కి ఆమె చాలా దగ్గరలో ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ .. హిందీ సినిమాలలోను తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. నిన్నమొన్నటి వరకూ ఒక వైపున 'పుష్ప' .. మరో వైపున హిందీలో 'మిషన్ మజ్ను' షూటింగుతో ఆమె బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఆమె కొత్త ప్రాజెక్టుగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కూడా పట్టాలెక్కింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లో జరుగుతోంది. శర్వానంద్ .. రష్మిక నాయకా నాయికలుగా ఈ సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'మిషన్ మజ్ను' ఒక రోజు షూటింగు కోసం ముంబై వెళ్లిన రష్మిక, ఈ రోజు ఉదయం తిరిగి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' షూటింగులో పాల్గొంది. ఇలా ఒకే సమయంలో రెండు మూడు ప్రాజెక్టులు చేస్తూ, ఎక్కే ఫ్లైటు .. దిగే ఫ్లైటు అన్నట్టుగా రష్మిక బిజీగా ఉంది.  
Rashmimka
Sharwanand
Adallu Meeku Joharlu

More Telugu News