Nani: షూటింగు పూర్తిచేసుకున్న 'శ్యామ్ సింగ రాయ్'

Shyam Singha Roy shooting completed
  • విడుదలకి సిద్ధమైన 'టక్ జగదీష్'
  • 'శ్యామ్ సింగ రాయ్' షూటింగు పూర్తి
  • సంక్రాంతి పండుగకి వచ్చే ఛాన్స్  
  • 'అంటే .. సుందరానికీ' పై పూర్తి దృష్టి
నాని ఈ ఏడాది ఎంచుకున్న కథలు చాలా విభిన్నమైనవి. వాటిలో 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. ఈ కథ .. కథనం చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయి. టైటిల్ .. నాని లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

కథా నేపథ్యం కారణంగా ఈ సినిమాను ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరించారు. సెట్ లో షూటింగు కావడం వల్లనే, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయగలిగారు. నిన్నటితో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుందనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

నాని సరసన నాయికలుగా సాయిపల్లవి  .. కృతి శెట్టి నటించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపించనుంది. కీలకమైన పాత్రను జిషు సేన్ గుప్తా పోషించాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు కనిస్తున్నాయి. 'టక్ జగదీష్'ను విడుదలకు రెడీ చేసి .. 'శ్యామ్ సింగ రాయ్'ను పూర్తిచేసిన నాని, 'అంటే .. సుందరానికీ' ప్రాజెక్టుపై పూర్తి దృష్టిపెట్టనున్నాడు.  
Nani
Sai Pallavi
Kruthi Shetty

More Telugu News