శ్రీలంకతో తొలి టీ20: టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 రన్స్

25-07-2021 Sun 21:50
  • కొలంబో వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచిన శ్రీలంక
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • అర్ధసెంచరీతో రాణించిన సూర్యకుమార్
  • 46 పరుగులు చేసిన శిఖర్ ధావన్
Team Indian innings concluded

శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. కొలంబో ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేశాడు.

కెప్టెన్ శిఖర్ ధావన్ 36 బంతులు ఆడి 4 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 46 పరుగులు నమోదు చేశాడు. సంజు శాంసన్ 27, ఇషాన్ కిషన్ 20 నాటౌట్, హార్దిక్ పాండ్యా 10 పరుగులు చేశారు. అంతకుముందు ఓపెనర్ పృథ్వీ షా తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. లంక బౌలర్లలో దుష్మంత చమీర 2, వనిందు హసరంగ 2 వికెట్లు తీశారు. చమిక కరుణరత్నేకి ఒక వికెట్ లభించింది.