టీమిండియాతో తొలి టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

25-07-2021 Sun 20:24
  • నేటి నుంచి టీ20 సిరీస్
  • కొలంబోలో తొలి మ్యాచ్
  • 3 ఓవర్లలో 18 పరుగులు చేసిన భారత్
  • పృథ్వీ షా డకౌట్
Sri Lanka won the toss in Colombo

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య టీ20 సిరీస్ షురూ అయింది. కొలంబో ప్రేమదాస స్టేడియంలో మొదటి మ్యాచ్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 3 ఓవర్లు పూర్తి కాగా, భారత్ ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా సున్నా పరుగులకే వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ శిఖర్ ధావన్ (8 బ్యాటింగ్), సంజు శాంసన్ (10 బ్యాటింగ్) ఉన్నారు. పృథ్వీ షా వికెట్ చమీరకు దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, వరుణ్ చక్రవర్తి అంతర్జాతీయ టీ20 పోటీల్లో అడుగుపెట్టారు.

కాగా, ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేలను భారత్ నెగ్గగా, నామమాత్రపు ఆఖరి మ్యాచ్ లో ఆతిథ్య శ్రీలంక విజయం సాధించింది.