ఏపీ రోజువారీ కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల

25-07-2021 Sun 18:17
  • గత 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు
  • 2,252 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 385 కేసులు
  • విజయనగరం జిల్లాలో 27 కేసులు
  • రాష్ట్రంలో 15 మంది మృతి
Corona cases increased in AP
ఏపీలో గత కొన్నిరోజుల కిందట కరోనా రోజువారీ కేసులు 2 వేలకు లోపే నమోదయ్యాయి. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 385 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316, నెల్లూరు జిల్లాలో 269, ప్రకాశం జిల్లాలో 241, పశ్చిమ గోదావరి జిల్లాలో 222 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 27 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 13,256 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,54,765 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,19,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,155 మందికి చికిత్స జరుగుతోంది.