పిజ్జా తినాలని ఉందన్న మీరాబాయి చాను... జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్

25-07-2021 Sun 16:05
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం
  • వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించిన చాను
  • పిజ్జా తినాలని ఉందన్న చాను
  • వెంటనే స్పందించిన డొమినోస్
Dominos Pizza offers Olympic medalist Mirabai Chanu lifetime free pizza

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రజతం అందించిన మణిపూర్ ఆణిముత్యం మీరాబాయి చాను పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఎప్పుడో కరణం మల్లీశ్వరి ఓ పతకం సాధించాక, ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో భారత్ కు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఓ పతకం దక్కింది. నిన్న టోక్యోలో చాను 49 కిలోల స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ పోటీలో రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకోవడం తెలిసిందే.

కాగా, తనది ఐదేళ్ల శ్రమ అని, ఈ పతకం సాధించిన ఆనందంలో వేడివేడిగా ఓ పిజ్జా లాగించాలని ఉందని మీరాబాయి చాను పేర్కొంది. దీనిపై ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినోస్ స్పందించింది. మీరాబాయి చానుకు జీవితకాలం పిజ్జా సరఫరా చేస్తామని, అంతకుమించి తమకు సంతోషకరమైన విషయం ఇంకేముంటుదని డొమినోస్ ఓ ప్రకటన చేసింది. వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చుతూ ఒలింపిక్ పతకాన్ని తీసుకుస్తున్న నీకు జీవితకాలం ఫ్రీగా పిజ్జా ఇవ్వడం మాకు అన్నిటికంటే ఆనందదాయకమైన విషయం అని డొమినోస్ పేర్కొంది.