ఏలూరు కార్పొరేషన్ లో పూర్తయిన ఓట్ల లెక్కింపు... 47 డివిజన్లలో ఎదురులేని వైసీపీ

25-07-2021 Sun 15:22
  • ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం
  • కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు
  • గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం
  • ఇవాళ 47 డివిజన్లకు ఓట్ల లెక్కింపు
  • 44 డివిజన్లలో వైసీపీ విజయం
  • 3 డివిజన్లతో సరిపెట్టుకున్న టీడీపీ
YCP wins Eluru municipal corporation

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉండగా, 47 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకుంది. మిగిలిన 3 డివిజన్లు టీడీపీకి దక్కాయి. గతంలో 3 డివిజన్లు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించగా, 44 డివిజన్లలో వైసీపీ విజయభేరి మోగించింది.

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క డివిజన్ లోనూ గెలుపు దక్కలేదు. అధికార వైసీపీ ధాటికి విపక్ష టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఏలూరు కార్పొరేషన్ ఫలితాల ద్వారా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం మరోమారు స్పష్టమైంది.