సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లిన చిరంజీవి

25-07-2021 Sun 15:05
  • ట్వీట్ చేసిన చిరంజీవి
  • సతీసమేతంగా సత్యనారాయణ నివాసానికి వెళ్లినట్టు వెల్లడి
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైనం
  • సత్యనారాయణ తనకెంతో ఆప్తుడని వివరణ
Chiranjeevi visits senior actor Kaikala Sathyanarayana

మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి తెలిపారు.